Scientists: భూమికు 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీలో ఆక్సిజన్ ...! 6 d ago

అనంతమైన విశ్వంలో భూమిపై తప్ప ఇంకెక్కడా ఆక్సిజన్ ఉండకపోవచ్చని శాస్త్రజ్ఞులు ఇప్పటివరకు భావించేవారు. కానీ, మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను శాస్త్రజ్ఞులు గుర్తించారు. అంతేకాకుండా భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ మేరకు విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్ బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.
ఈ నక్షత్ర మండలానికి జేడ్స్-జీఎస్-జెడ్14-0(JADES-GS-Z14-0) అని నామకరణం కూడా చేశారు. వాస్తవానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు.. అయితే, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తీసుకొచ్చింది. కాగా, దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం సంచలన పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. ఇది పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న.. ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా.